21-11-2025 10:15:29 PM
ఇద్దరికి ఒకరోజు జైలు
సిద్దిపేట క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపిన ఎనిమిది మందికి రూ.80,500 న్యాయమూర్తి జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష పడిందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో పలు చౌరస్తాలు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, ఎనిమిది మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్టు బ్రీత్ ఎనలైజర్ తో నిర్ధారించినట్టు చెప్పారు. శుక్రవారం సిద్దిపేట ఒకటవ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఎదుట ముందు హాజరుపరిచామని తెలిపారు. విచారణ అనంతరం న్యాయమూర్తి తీర్పు వెలువరించారని పేర్కొన్నారు.