21-11-2025 10:25:47 PM
తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని బరంపూర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సిపిఆర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యక్తులు ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు లేదా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు లేదా కరెంటు షాక్ వంటి ప్రమాదాలు జరిగినప్పుడు గుండెను మళ్లీ పనిచేసేలా సిపిఆర్ చేయడం వలన వ్యక్తులు రక్షించబడతారని తెలిపారు.
సుమారు 80 శాతం వ్యక్తులు సిపిఆర్ చేయకపోవడం వలన మరణానికి దగ్గరవుతున్నారని తెలిపారు. సిపిఆర్ పై అవగాహన పెంచుకోవడం వలన చనిపోయిన వ్యక్తులను మళ్లీ బ్రతికించే అవకాశం ఉంటుందని తెలిపారు. తదనంతరం విద్యార్థులకు సిపిఆర్ పై ప్రాక్టికల్స్ నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యార్థి సిపిఆర్ ఎలా చేయాలో చేసి చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు ప్రజ్ఞ జ్యోతి, ఉపాధ్యాయులు సంగీత, సుజాత, లక్ష్మి నారాయణ అంపెల్లి, అమరేందర్ తదితరులు ఉన్నారు.