calender_icon.png 21 November, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార హక్కు చట్టం దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

21-11-2025 10:22:53 PM

రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల సమాచార అధికారులతో సమీక్ష

హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే  సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సమాచార హక్కు చట్టం, అప్పీళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో సమీక్షా సమావేశాన్ని రాష్ట్ర సమాచార కమిషనర్ నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో  వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు తమ తమ శాఖల పరిధిలో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన వాటి సంఖ్య, పరిష్కరించిన దరఖాస్తులు, ఇంకా పరిష్కరించాల్సిన వాటి గురించి రాష్ట్ర సమాచార కమిషనర్ కు వివరించారు.సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లాడుతూ సమాచార కమిషన్ ప్రజలలో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలు తమకు సమాచారం కావాలని ప్రభుత్వ కార్యాలయాల్లో  పౌర సమాచార అధికారులు దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. చట్టం ప్రకారం సమాచారం కోరిన దరఖాస్తుదారుకు నిర్ణీత గడువులోగా సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్ఓ గణేష్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.