calender_icon.png 21 November, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

21-11-2025 10:12:13 PM

వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు

వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని రామాంజాపూర్ గ్రామ శివారులోని చెంచు కాలనీలో గల బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గిరిబాబు ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించడంతోపాటు విద్యార్థుల తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు.

అనంతరం వంట చేస్తున్న ప్రదేశానికి వెళ్లి వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుని గది వద్దకు వెళ్లి విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ బొమ్మల రమేష్, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.