calender_icon.png 6 December, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెంబర్ ప్లేట్ లేని 73 వాహనాలకు జరిమానా

06-12-2025 10:04:48 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): నెంబర్ ప్లేట్ లేని 73 వాహనాలకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు జరిమానా విధించారు. శనివారం నగరంలో విస్తృత వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తనిఖీలలో ముఖ్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో సరైన నెంబర్ ప్లేట్లు (రిజిస్ట్రేషన్ ప్లేట్లు) లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా మొత్తం 73 వాహనాలను గుర్తించి, వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. జరిమానాలు విధించిన అనంతరం, ఆయా వాహనాలకు తక్షణమే సరైన నెంబర్ ప్లేట్లను బిగింపజేసి పంపినట్లు కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టరు  కరీంఉల్లాఖాన్ తెలిపారు. పౌరులు రోడ్డు భద్రతా నియమాలను, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.