09-12-2025 07:37:58 PM
సిద్దిపేట క్రైం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన నలుగురికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు రూ.41 వేలు జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆయన సిబ్బందితో సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయగా, నలుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నట్టు చెప్పారు. వారిని బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా, మద్యం తాగినట్టు రిపోర్ట్ రావడంతో మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. న్యాయమూర్తి విచారణ జరిపి వారికి జరిమానా విధించారని చెప్పారు.