09-12-2025 07:42:30 PM
ఉప్పల్ (విజయక్రాంతి): నాచారం హెచ్ఎంటి నగర్ లోని మ్యాన్‌హోల్ మరమ్మత్తు పనులను నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పరిశీలించారు. గత కొద్దికాలంగా జలమండలి అధికారులు పెద్ద మొత్తంలో మంచినీరు ఒకేసారి వదలడంతో మ్యాన్‌హోల్ కూలిపోయి మురికినీరు రోడ్లపై ప్రవహించడంతో కార్పొరేటర్ శాంతి జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సేకరించిన అధికారులు కూలిపోయిన మ్యాన్‌హోల్ ప్రాంతాల్లో కొత్త మ్యాన్‌హోల్ లను ఏర్పాటు చేశారు.
మ్యాన్‌హోల్ ఏర్పాటు పనులను కార్పొరేటర్ శాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంతకాలంగా కూలిపోయిన మ్యాన్‌హోల్ ల వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు మురికి నీరు రోడ్లపైకి వస్తుందని కాలనీవాసులు తమకు ఫిర్యాదు చేయడంతో అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినట్టు ఆమె తెలిపారు. కూలిపోయిన మ్యాన్‌హోల్ ప్రాంతంలో కొత్త మ్యాన్‌హోల్ తో పాటు అన్ని మ్యాన్‌హోల్ మరమ్మత్తులను శుభ్రపరచాలని అధికారులను ఆమె ఆదేశించారు.