09-12-2025 07:37:01 PM
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో అన్ని సెషన్లు ముగిశాయి. అనంతరం ముగింపు వేడుకల్లో తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ ను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. సమిట్ కు విభిన్న ఆలోచనలతో వచ్చిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అందరి సూచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని, తెలంగాణ భవిష్యత్ కు ఈ డాక్యుమెంట్ ఒక దిక్సూచి అన్నారు. సమిట్ కు హాజరైన వాళ్లు కేవలం ఆలోచనలు మాత్రమే పంచుకోలేదని, లక్ష్యాలను సాధించే మార్గాలను కూడా సూచించారని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు కూడా ప్రాధాన్యం ఇస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిది, సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యం తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించింది కాదని, విస్తృత సంప్రదింపులు, అభిప్రాయాల తర్వాత దీన్ని రూపొందించామన్నారు.