10-12-2025 09:57:52 AM
విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్‌లోని( Visakhapatnam Beach Road) ఒక అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.