calender_icon.png 10 December, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైత్రివనంలోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

10-12-2025 10:09:14 AM

హైదరాబాద్: నిత్యం జనంతో రద్దీగా అమీర్‌పేటలోని మైత్రీవనంలో(Maitrivanam) బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. శివమ్ టెక్నాలాజీస్ కోచింగ్ సెంటర్‌లో  మంటలంటుకున్నాయి. మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో కోచింగ్ సెంటర్ల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.