calender_icon.png 10 December, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్ గిన్నిస్ రికార్డ్

10-12-2025 09:27:11 AM

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)లో ఘనంగా ముగిసింది. మూడు వేల డ్రోన్లతో ఆకాశంలో 'తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్, జాయిన్ ది రైజ్' ఆంగ్ల వాఖ్యం ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేశారు. అబుదాబీలో 2,131 డ్రోన్లతో హ్యామీ న్యూయర్ డ్రోన్ షో రికార్డును తెలంగాణ ప్రభుత్వం అధిగమించింది. రెండు రోజుల పాటు జరిగిన గ్లోబర్ సమ్మిట్ లో ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, విద్య, వైద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్ లపై చర్చించారు.

రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి సుమారు 100కుపైగా అవగాహన ఒప్పందాలు జరిగాయి. రెండో రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ కొనసాగింది. గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ప్రజలకు అంకితమిచ్చారు. అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.