18 April, 2026 | 2:21 AM

పత్తి కట్టెల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

18-04-2026 12:00 AM

ఫైర్ సేఫ్టీ మేజర్స్  లేని కారణంగానే ఎగిసిపడిన మంటలు

బేల, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) :  మండలంలోని డోప్టల గ్రామ శివారు లోని రైతు ఉర్జా బ్రిగేడ్ ఫ్యాక్టరీ ఆవరణలో  శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ ఆవరణలో దాదాపు తొమ్మిది ఎకరాల స్థలంలో పెద్ద ఎత్తున ఎండిన పత్తి కట్టే నిల్వ ఉంచడంతో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో  ఎండిన పత్తి కట్టలకు నిప్పు అం టుకొని మంటలు ఎగిసిపడ్డాయి. ఘటన ను గమనించిన కార్మికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చెయ్యడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

జిల్లా కేంద్రం నుంచి దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిన స్థలానికి  ఫైర్ ఇంజన్ చేరుకునే సరికి పత్తి కట్టెలు కాలిబుదిదఅయి పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. ఎక్కువ మోతాదులో పత్తి కట్టెలు నిల్వ ఉంచిన స్థలంలో ఫ్యాక్టరీ నిర్వాహకులు ఎలాంటి ఫైర్ సేఫ్టీ మేజర్స్ పాటించకపోవడం తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలు స్తుంది. విషయం తెలుసుకున్న బేల ఎస్.ఐ మధు కృష్ణ ముందుగా ఘటన స్థలానికి చేరుకుని తమ పోలీసు సిబంది, గ్రామ పంచా యతీ సిబ్బంది నీటి ట్యాంకర్‌ల ద్వారా మం టలను ఆర్పే ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. అగ్ని మాపక సిబ్బంది రావడంతో మంటలను అదుపు చేయడంతో  ఫాక్టరీలోని ఇతర పత్తి కట్టెల నిల్వలకు మంటలు వ్యాప్తి చెందలేదు.