18 April, 2026 | 2:20 AM

హీమోఫిలియా అవగాహన ర్యాలీ

18-04-2026 12:00 AM

మంచిర్యాల, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత శుక్ర వారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని సిక్కిం కలిసిమియా సంబంధించిన వ్యాధిగ్రస్తులు, వారికి అందిస్తున్న వైద్య సేవలను గురించి తెలియజేశారు.

జిల్లాలో గర్భవతులకు పరీక్షలు చేయడం, వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారికి మందులతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జ రుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రో గ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, చందూరి మహేందర్, సిహెచ్‌ఓలు నామ్ దేవ్, కాకి రాళ్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, స్నేహ ఎన్జీవో సభ్యులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.