calender_icon.png 3 July, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాబా, రెస్టారెంట్, హోటళ్ల యజమానులకు అవగాహన కార్యక్రమం..

03-07-2025 02:23:10 PM

  1. చట్టానికి అనుకూలంగా యజమానులు సహకరించాలి..
  2. దాభాల వద్ద సీసీ. కెమెరాలు బిగించాలి...
  3. రాత్రి 11 వరకు దాభాలను నిర్వహించాలి
  4. లిక్విడ్, మందు విక్రయాలు మానుకోవాలి..
  5. నిబంధనలను ఉల్లంఘిస్తే దాబాల యజమానులపై కఠిన చర్యలు 

తూప్రాన్, (విజయక్రాంతి): డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో లింగారెడ్డి గార్డెన్స్ తూప్రాన్ మున్సిపల్(Toopran Municipal)లో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డాబా, రెస్టారెంట్, హోటళ్ల యజమానులకు సూచన ప్రాయంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ అవైర్ నెస్ కల్పించారు. ముఖ్యంగా రాత్రుల్లో చోరికి పాల్పడే ముష్కరులు దాబలను, రెస్టారెంట్, హొట్టలను ఆసరా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని మీరూ చట్టానికి అనుకూలంగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, దీన్ని ద్వారా ముష్కరుల యొక్క కార్యచరణను పసిగట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.

చట్టానికి విధేయత ఉంచి మాకు సమాచారం ఇవ్వాలని, మీ కార్యాచరణ ద్వారా క్రైమ్ ను నిరోధించవచ్చని తెలియచేసారు. రాత్రుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు కల్తీలేని మంచి ఫుడ్ ను ఏర్పాటు చేయాలి, దాభాలలో మందు విక్రయాలు చేయరాదని హెచ్చ రించారు, దాభాల నిర్వహణ రాత్రి 11 వరకు నిర్వహించాలని ధాభాల వద్ద గాంజా అమ్మకాలు జరుగుతున్నాయని అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేని పక్షంలో ఎవరైనా చట్ట నిభందనలు ఉళ్ళంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని సూచన ప్రాయంగా డిఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. ఇందులో తూప్రాన్ సిఐ, నర్సాపూర్ సిఐ, రామయంపేట్ సిఐ, తూప్రాన్ ఎస్ఐ, డివిజన్ పరిధి ఎస్ఐ లు ఉన్నారు.