03-07-2025 02:20:35 PM
మలిదశ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు నాగమల్లు
తుంగతుర్తి, (విజయక్రాంతి): జులై 5 న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం (గన్ పార్క్) వద్ద మలి దశ తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవంలో తెలంగాణ ఉద్యమకారులు విద్యావంతులు, మేధావులు ,నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని మలిదశ ఉద్యమకారుడు మండల అధ్యక్షుడు ఉప్పుల నాగమల్లు అన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తూనే ఉన్నాయి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీలిచ్చి మీనిపిస్టలో పెట్టి గద్దేనెక్కి కాలయాపన చేస్తుంది. ఉద్యమకారులను గుర్తిచేయాంతవరకు ప్రజాశ్వామ్య పద్ధతిలో మాపోరాటాలు ఉంటాయని తెలిపారు.