calender_icon.png 3 July, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ రక్షణకు మొక్కలు నాటాలి

03-07-2025 02:25:41 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు.గురువారం ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ లోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా డిఎండబ్ల్యూ ఓ నదీమ్ తో కలసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.అనంతరం పాఠశాల వంటగది ,సరుకులను పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎల్ సి పుష్పలత,గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.