calender_icon.png 3 July, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల గురించి కవిత లేఖలు రాయడం హాస్యాస్పదం

03-07-2025 01:34:28 PM

హైదరాబాద్: బీసీల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kalvakuntla Kavitha) లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అన్నారు.  రేపు సామాజిక న్యాయ సమరభేరి పేరిట కార్యక్రమం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. గ్రామ కమిటీలను ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారని సూచించారు. రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు.

బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మల్లికార్జున ఖర్గేకి లేఖ రాయనున్నట్లు గురువారం ప్రకటించారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన బీసీల గురించి కవిత లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత... బీసీల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీసీల కోసం వాగ్దానాలు చేసిన రోజు కవిత జైలులో ఉన్నారని చెప్పారు. గతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కేబినెట్ లో మహిళలు లేకుంటే కవిత ప్రశ్నించారా? అని అడిగారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీనేతలు మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు.