calender_icon.png 3 July, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ కు అనుకూలంగా కార్మిక చట్టాలను రద్దుకు యత్నం

03-07-2025 02:18:08 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్

మంచిర్యాల, (విజయక్రాంతి): కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉంచేందుకే కార్మిక చట్టాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్(CPI District Secretary Ramadugu Lakshman) అన్నారు. మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకే రవి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి దేవరాజులతో కలిసి ఆయన మాట్లాడారు.

44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్ లను అమలు చేయడం అంటే కార్పొరేట్ అధిపతులకు అనుకూలం అని, సహజ సంపదలను కార్పొరేట్లకు కట్టపెట్టడానికేనని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకే 44 కార్మిక చట్టాల రద్దు అని ఇది బిజెపి ప్రభుత్వంను కార్పోరేట్ శక్తుల ద్వారా సుస్థిరం చేసేందునని విమర్శించారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు,ఉద్యోగులు పాల్గొని బిజెపి ప్రభుత్వం కు నిరసన తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మేకల దాసు, కలిందర్ అలీ ఖాన్, జోగుల మల్లయ్య, దాగం మల్లేష్, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, మిట్టపల్లి పౌలు, సిపిఐ (ఎం) నాయకులు రంజిత్, దూలం శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, రాజు, మహేష్, మోహన్. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు శ్రీకాంత్, మల్లయ్య, దొండ ప్రభాకర్, అరుణ, చిన్నయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.