03-07-2025 02:28:25 PM
నూతనకల్, (విజయక్రాంతి): మండల పరిధిలోని ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన ఇరుగు వెంకన్న తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్(Suryapet District Social Media Convener)గా ఎన్నికైనట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ కుమార్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నకిరేకంటి చిరంజీవి లు తెలిపారు గురువారం మండల కేంద్రంలో నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఇరుగు వెంకన్న మాట్లాడుతూ.. నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులు నకిరేకంటి కిరణ్ కుమార్ పేరాల యాదగిరి నకిరేకంటి చిరంజీవి జిల్లా అధ్యక్షులు కోట వీరస్వామి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాముల కృష్ణయ్య మల్లెపాక లింగయ్య బోయల వెంకటమ్మ సూరారపు శ్రీను బానోత్ శాంతి నెమ్మది రమణ కొణిదల లింగమ్మ రామలింగమ్మ తదితరులు పాల్గొన్నారు