31 May, 2026 | 5:12 PM

సిలిండర్ లీకేజీతో అగ్ని ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

31-05-2026 04:26 PM

- ప్రమాదంలో తల్లి, కొడుకు ఇద్దరికీ తీవ్ర గాయాలు

- చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలింపు

ఆర్మూర్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కాశీ హనుమాన్ కాలనీలో గ్యాస్ సిలిండర్ లీకేజీతో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాశి హనుమాన్ కాలనీలోని ఆదిత్య చికెన్ సెంటర్, కిరాణా దుకాణంలో గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో తల్లి కొండూరు రుక్మాబాయి, కుమారుడు రాజేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు తీవ్రంగా వ్యాపించడం వల్ల స్థానికుల సమాచారంతో ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించారు. 

గ్యాస్ సిలిండర్ లీకేజీ ప్రమాద ఘటనలో గాయపడ్డ తల్లి, కుమారుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ తల్లి రుక్మాబాయి చాతి భాగంలో సుమారు 60 శాతానికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లిని కాపాడే క్రమంలో కొడుకు రాజేష్ కు కూడా చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల ఏర్పడ్డ ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం సంభవించలేదు. అగ్ని ప్రమాదంలో 60 శాతం పైగా గాయాలు గాయాలు అయిన రుక్మాబాయి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.