calender_icon.png 1 September, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

01-09-2025 10:44:01 AM

  1. మండలి ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టిన బీఆర్ఎస్ సభ్యులు
  2. రాహుల్ కు సీబీఐ వద్దు... రేవంత్ కు సీబీఐ ముద్దు
  3. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే కొనసాగుతున్న మండలి
  4.  జైతెలంగాణ నినాదాలతో హోరెత్తిన మండలి
  5. కాళేశ్వరం కమిషన్ నివేదికను చింపిన బీఆర్ఎస్ సభ్యులు

హైదరాబాద్: శాసనమండలి సమావేశాలు(Legislative Council Meetings) సోమవారం ప్రారంభం అయ్యాయి. శాసనమండలిలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల జై తెలంగాణ నినాదాలతో మండలి హోరెత్తింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక పత్రులు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) సభ్యులు చించేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(PC Ghosh Kaleshwaram Commission Report) ప్రతులు చింపి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ వైపు విసిరారు. రాహుల్ కు సీబీఐ వద్దు.. రేవంత్ కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. మండలి ఛైర్మన్ పోడియాన్ని బీఆర్ఎస్ సభ్యులు చుట్టుముట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే మండలి కొనసాగుతోంది. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.