01-09-2025 09:10:10 AM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): త్వరలో సింగరేణి సంస్థ(Singareni company) విదేశాల్లో కూడా అడుగు పెడుతుందని సింగరేణి చైర్మన్, సిఅండ్ ఎండీ బలరాం నాయక్ తెలిపారు. సింగరేణి 55వ వార్షిక భద్రత పక్షోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి క్యాతనపల్లి స్థానిక ఎమ్ఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిఅండ్ ఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఆయా సంస్థలు వేరే చోటు నుంచి బొగ్గు కొనడానికి ప్రభుత్వాలు అనుమతిస్తే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు.ఈ నేపథ్యంలో నే రాజస్థాన్ లో సోలార్ ప్లాంట్లు,కర్నాటకలో బంగారు గనుల తవ్వకాలను ఇలా కొత్త మార్గాలలో అడుగు పెడుతున్నామని అన్నారు.
సింగరేణి లో రక్షణకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మరోసారి సిఅండ్ ఎండీ బలరాం నాయక్(CMD of Singareni Balaram Nayak) తెలిపారు. కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని అలాగే ఈ ఏటా 100 మిలియన్ టన్నుల బొగ్గు బొగ్గు ఉత్పత్తి సాధించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతిభ చూపిన పలు డిపార్ట్మెంట్లకు బహుమతులు అందజేశారు. అనంతరం పదవీ విరమణ పొందిన డైరెక్టర్(ఈఎం) సత్యనారాయణ,జీఎం కో-ఆర్డినేషన్ సుభానిలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ టి.ఆర్.కన్నన్, సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ,సత్యనారాయణ, గౌతం పొట్రు,వెంకటేశ్వర్లు,సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్,కార్మిక సంఘల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య,జనక్ ప్రసాద్, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మిపతిగౌడ్,శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.