01-09-2025 11:07:23 AM
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైంది
హైదరాబాద్: కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ఆరోపించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పూర్తి బాధ్యత వహించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతిపై మొదటి నుంచే సీబీఐ విచారణ కోరుతున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ను కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందని విమర్శించారు. ఈ రోజు ప్రభుత్వం సత్యానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించడానికి అంగీకరించింది. తక్షణమే సీబీఐకి లేఖ పంపాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలోనూ ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై కాంగ్రెస్ సిట్ ను ప్రకటించిందని చెప్పారు. సిట్ ను ప్రకటించినా నేటికీ ఆచరణ రూపం దాల్చలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం డైలీ సీరియల్ లా కొనసాగుతోందని తెలిపారు.
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుంకుంది. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికి శిక్షపడాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్న సీఎం కమిషన్ ఇచ్చిన రిపోర్టులో లోపం ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, సుదీర్ఘ అనుభవం ఉన్న ఘోష్‌ని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. పీసీ ఘోష్ అనేక ముఖ్యమైన హోదాల్లో పనిచేశారని, ఎన్నో కీలక తీర్పులు ఇచ్చార రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రాసుకున్న నివేదిక అన్నారు. అందుకే ఇందులో కేసీఆర్, హరీష్ రావు అవినీతి గురించి ప్రస్తావన లేదని ఆరోపించారు. ఇప్పటివరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని ద్వజమెత్తారు.