01-09-2025 10:49:45 AM
పొంగి ప్రవహిస్తున్న వాగులు
రాకపోకలకు అంతరాయం
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్(Mahabubabad rain) ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లాలోని గూడూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పాకాల వాగు హై లెవెల్ వంతెన పై నుండి పొంగి ప్రవహిస్తుండడంతో కేసముద్రం, నెక్కొండ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురుస్తూనే ఉంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.