25 April, 2026 | 10:20 AM

ఫ్లిప్‌కార్ట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

20-12-2024 10:25 AM

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ పరిధి ఎర్రబోడలోని ఫ్లిప్‌కార్ట్ గోదాములో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన వివిధ వస్తువులను నిల్వ చేస్తున్న గోదాంలో మంటలు వ్యాపించాయి. ఫలితంగా అందులోని వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గోదాంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో సమీపంలోని నివాసితులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న గోదాం నిర్వాహకులు పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.