31 August, 2026 | 6:05 AM

బావిలో పడిన మహిళ.. కాపాడిన ఫైర్ సిబ్బంది

09-06-2024 11:41 AM

రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయ సమీపంలో ప్రమాదవశాత్తు కూర రాజమణి అనే మహిళ (45) చేత బావిలో జారి పడింది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ మహిళ ప్రాణాలతో కాపాడి బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మహిళను 108 వాహనంలో  స్థానిక  ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బందికి స్థానికులు, పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది లీడింగ్ ఫైర్ మాన్ మునీంద్ర చారి, ఫైర్ మాన్ మారం రాజేశ్వర్, జీవన్ రెడ్డి, యాదగిరి ఉన్నారు.