31 August, 2026 | 7:12 AM

రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

09-06-2024 11:32 AM

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి అంత్యక్రియలు జరిగే స్మృతివనం వరకు అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమ సంస్కారాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సుజనా చౌదరి, రఘురామ, చింతమనేని ప్రభాకర్, పట్టాభి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి క్రిష్ణ రావు, సీతక్క, ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచారం శ్రీనివాస్, నామా నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, నలమోతు భాస్కర్ రావు, వేం నరేందర్ రెడ్డి, వెనిగండ్ల రాము, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి రమణ, వి. హనుమంతరావు, కె.ఆర్. సురేశ్ రెడ్డి, వద్ది రాజు రవిచంద్ర, దేవినేని ఉమ, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.