ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు
09-06-2024 11:57 AM
హైదరాబాద్: రామోజీరావు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతవనంలో రామోజీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు చేశారు. ఆయనకు కడసారి కన్నీటీ వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీ రాజకీయ నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, పలువురు సినీప్రముఖులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబీకులు, బంధువులు, ఆయన అభిమానులు కన్నీరుమన్నీరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన నారా చంద్రబాబు నాయుడు రామోజీరావు పాడెను మోసారు. శ్వాసకోశ సమస్యలతో జూన్ 5న హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.






