calender_icon.png 8 September, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కంటైనర్ లో మంటలు

08-09-2025 10:22:44 AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా(Indalwai Toll Plaza) వద్ద సోమవారం ఉదయం కంటైనర్ లో భారీ మంటలు అలుముకున్నాయి. కంటైనర్ డీజిల్ ట్యాంకు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నయి. వెంటనే గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అనంతరం పోలీసులకు, అగ్నిమాపక శాఖకు టోల్ ప్లాజా సిబ్బంది సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.