calender_icon.png 8 September, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న నిమజ్జన వ్యర్థాల తొలగింపు

08-09-2025 09:55:55 AM

హైదరాబాద్: నగరంలో నిన్నటి వరకు జరిగిన గణేశ్ నిమజ్జనాల అనంతరం గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) వ్యాప్తంగా సోమవారం వ్యర్థాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చెత్త తొలగించే పనులను సిబ్బంది చేపట్టారు. నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాల్లో వ్యర్థాల తొలగింపు కొనసాగుతుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(GHMC Commissioner RV Karnan), జోనల్ కమిషనర్లు, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. వినాయక చవితి తర్వాత 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సిబ్బంది సేకరించింది. సేకరించిన వ్యర్థాలను అధికారులు జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలిస్తున్నారు.