08-09-2025 01:04:47 PM
హైదరాబాద్: హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. హెచ్ఎండీఏ కార్యాలయానికి ఆర్ఆర్ఆర్(RRR) బాధితులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆర్ఆర్ఆర్ వల్ల తమ పంట పోలాలు పోతున్నాయని.. ఆర్ఆర్ఆర్ భూములను తక్కువ ధరకే కేటాయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోకుండా ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ తక్షణమే రద్దు చేయాలని.. పాత అలైన్‌మెంట్ కొనసాగించాలని బాధితులు డిమాండ్ చేశారు.