8 June, 2026 | 2:45 AM

శ్రీగంధం తోటకు నిప్పు

08-06-2026 01:18 AM

మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన నెల్లూరి శ్రీ నివాసులు అనే రైతుకు చెందిన 8 ఎకరాల శ్రీగంధం తోటను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఎకరాల వ్యక్తిగతంలో ఉన్న శ్రీ గంధం చెట్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమై ఆర్థికంగా నష్టపోయినట్లు చెప్పా డు. ఈ ఘటనపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్ కు విజ్ఞప్తి చేశాడు.