14-07-2025 01:41:45 AM
ముషీరాబాద్, జూలై 13 (విజయక్రాంతి) : వంద సంవత్సరాల చరిత్ర గల ముషీరాబాద్‌లోని మహాంకాళి అమ్మవారి దేవాల యానికి ఆలయ ప్రధాన అర్చకులు వై.చం ద్రమౌళి కుటుంబం ఆదివారం మొదటి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా శివాలయం వద్దగల చంద్రమౌళి ఇంటి నుంచి పోతరాజుల ఊరేగింపు, డప్పుల దరువుల మధ్య బోనంను తీసుకువచ్చి అమ్మ వారికి సమర్పించారు. దారిపొడవున భక్తు లు మొదటి బోనానికి ఘనస్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చి పూజలు చేశారు.
ఈ సందర్భంగా వై.చంద్రమౌళి మాట్లాడుతూ... గత అనేక సంవత్సరాలుగా అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. వారం రోజుల పాటు ఆషాడమాస బోనాల ఉత్సవాలు ఆదివారం సామూహిక బోనాలు, సోమవారం పోతరాజులు, పలహరం బండ్ల ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ చారి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఎయిర్టెల్ రాజు, దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్, నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.