14-07-2025 01:40:17 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): విజయ్‌నగర్ కాలనీలోని వెట్స్ హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ వెటర్నరీ అసోసియేషన్ ద్విభాషా త్రైమాసిక జర్నల్‌ను డాక్టర్ ఎంవీ రెడ్డి (రిటైర్డ్ ఐఏఎస్) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. ఫీల్డ్ వెటర్నరీ వైద్యులు, రైతుల ప్రయోజనం కో సం మ్యాగజైన్ ప్రచురణకు అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఫీల్డ్ వెటర్నరీ వైద్యుల జ్ఞానాన్ని రిఫ్రెష్ చేయడం, పశుసంవర్ధక పద్ధతులపై తాజా నవీకరణలపై రైతులకు ఉపయోగకరమైన సమాచా రాన్ని అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతరాయం లేకుండా ప్రచురణ కొనసాగడానికి సీజీ కార్పస్ ఫండ్‌ను రూపొందించాలని ఆయన అసోసియేషన్‌కు సూచించారు. ఈ సూచనను అసోసి యేషన్ అధ్యక్షుడు డాక్టర్ అనంతం స్వాగతించారు. మ్యాగజైన్‌ను తీసుకురావడంలో చేసిన ప్రయత్నాల గురించి వివరించారు.
ద్విభాషా త్రైమాసిక జర్నల్ లక్ష్యలను డాక్టర్ కొండల్‌రెడ్డి చీఫ్ ఎడిటర్ వివరించి, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, డాక్ట ర్ పురుషోత్తం, డాక్టర్ సుధాకర్‌రావులను పరిచయం చేశారు. పశువుల పెంపకంపై తాజా సమాచారాన్ని అందించడం ద్వారా పశువుల రైతులకు సేవ చేస్తున్నందుకు మాజీ వైస్ చానసలర్ డాక్టర్ ప్రభాకర్‌రావు అసోసియేషన్‌ను ప్రశంసించారు. అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ దుర్గయ్య, కేవీఎస్ నర్సింహరావు పాల్గొన్నారు.