13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

చికెన్ వ్యర్థాలతో చేపల పెంపకం

31-03-2026 07:09 PM

పట్టించుకోని మత్స్యకార సంబంధిత అధికారులు

అంతా నా ఇష్టం... నేను ఇలానే పెంచుతాను చేపలను 

ఇంత దారుణమా అని ప్రశ్నిస్తున్న ప్రజలు 

వేములపల్లి,(విజయక్రాంతి): వేములపల్లి మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న అన్నపరెడ్డిగూడెం గ్రామ శివారులో ఓ రైతు తన పొలంలో చేపలను పెంచడానికి చెరువులను తొవించాడు. ఈ చెరువులలో చేపలను పెంచుతూ చికెన్ వేస్ట్ ను వాటికి ఆహారంగా వేస్తున్నాడు. ఈ తదంగం ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం అటువైపు జాడే లేరని పలువురు గుసగుసలాడుతున్నారు.

ఈ చెరువుకు చికెన్ వేస్టేజ్ హైదరాబాదు నుండి కొన్ని వాహనాలలో తీసుకువచ్చి ఎటువంటి బాయిల్డ్ చేయకుండానే చెరువులో చేపలకు మేతగా వేస్తున్నారు. ఇలా చేపలను పెంచడం వల్ల ఈ చేపలను తినేవారికి ఆరోగ్య సమస్యలు మెండుగా వస్తాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చికెన్ వేస్టేజ్ వేసి చేపలను పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.