04-09-2025 05:26:33 PM
20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మత్స్య శాఖ అధికారి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న మత్స్యశాఖ అధికారి ఎం. చారిత రెడ్డి(Fisheries Officer M. Charitha Reddy) లంచం స్వీకరిస్తూ తన కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీకి కొత్త సభ్యుల అనుమతుల కోసం ఫిర్యాదుదారుని నుంచి రూ.20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. బాధితుల నుంచి తీసుకున్న నగదును అధికారి తన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగులో పెట్టుకున్నారు.
తన దగ్గర పెట్టుకున్న లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు వెంటనే దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అధికారిణి తన పదవిని దుర్వినియోగం చేసి అవినీతిపరంగా వ్యవహరించినట్టు తేలడంతో ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, హైదరాబాద్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరు పరిచారు. కేసు దర్యాప్తులో ఉంది. లంచం డిమాండ్ జరిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా వాట్సప్ (9440446106), ఫేస్ బుక్, (తెలంగాణ ఏసీబీ,) లో కూడా సమాచారం అందించవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయన్నారు.