calender_icon.png 4 September, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతులు పడిగాపులు

04-09-2025 07:18:01 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా(Hanamkonda District) ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం గత రెండు రోజులుగా రైతులు బారులు తీరుతున్నారు. వ్యవసాయ రంగంపై జీవనోపాధి పొందుతున్న రైతులు వారి కుటుంబాలు ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు వదులుకొని లైన్ లో నిలబడుతున్నారు. యూరియా బత్తాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పినప్పటికీ రైతులు యూరియా బత్తాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రోజుకు 300 బస్తాలు ఇస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రాథమిక సంఘం కమిటీ లోని పలు గ్రామాలకు చెందిన రైతులు వందలాదిమంది సహకార సంఘ కార్యాలయానికి చేరుకొని బారులు తీరుతున్నారు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ రైతులు రోజుల తరబడి యూరియా బస్తాల కోసం నిరీక్షణ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని యూరియా బస్తాలను సకాలంలో పంపిణీ చేయాలని దాప్యం చేస్తే పంటలకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.