calender_icon.png 4 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ లో లడ్డు వేలం

04-09-2025 06:38:32 PM

అర్మూర్ (విజయక్రాంతి): మహా గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఆర్మూర్ బార్ అసోసియేషన్(Armoor Bar Association) ఆధ్వర్యంలో నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్నటువంటి మహాగణపతి యొక్క మహా లడ్డు ప్రసాద వేలం పాట నిర్వహించారు. ఈ యొక్క వేలంపాటలో సీనియర్ న్యాయవాది బండారి నర్సయ్య మహా లడ్డు ప్రసాదాన్ని 22,500కు వేలం పాట ద్వారా దక్కించుకున్నాడు. బార్ అసోసియేషన్ ఆర్మూర్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, కోశాధికారి చైతన్య, సీనియర్ న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, కె.గంగారెడ్డి, ఎస్.శ్రీధర్, వి.జగదీశ్వర్ రెడ్డి, కృష్ణ పండిత్, చిలుక కిష్టయ్య, కృష్ణంరాజు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.