calender_icon.png 4 September, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డివిజనల్ పంచాయతీ అధికారి

04-09-2025 07:29:06 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని అక్కచెల్లెళ్ల చెరువులో శుక్రవారం రోజున నిర్వహించే గణేష్ నిమజ్జనం ఉత్సవ ఏర్పాట్లను గురువారం చౌటుప్పల్ డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్(Panchayat officer Pratap Naik) వలిగొండ ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిమజ్జనోత్సవం రోజున పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కేదార్ ఈశ్వర్, కార్యదర్శి నాగరాజు, బిల్ కలెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.