04-09-2025 06:36:11 PM
అర్మూర్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని అయిదు, ఆరు వార్డులలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై మున్సిపల్ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్ నర్సయ్య, సానిటరీ జవాన్లు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.