calender_icon.png 4 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడా(గిరిజన)జోలికి వస్తే సహించేది లేదు

04-09-2025 06:52:23 PM

రమావత్ లాలు నాయక్,

ఇస్లావత్ సురేష్ నాయక్ 

కొండమల్లేపల్లి బంజారా సేవ సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి...

దేవరకొండ: గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్న భద్రాచలం ఎమ్మెల్యే  తెల్లం వెంకటరావు(MLA Tellam Venkata Rao)ని మాజీ ఎంపీ సోయం బాబురావుని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మల్లేపల్లి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రమావత్ లాలూ నాయక్, ఇస్లావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ చిచ్చులు పెట్టి వారి మధ్య తగాధాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని సోయం బాబు రావు, తెల్లం వెంకట్రావు అదే విధంగా కొంతమంది కలిసి వివిధ రకాల కుట్రలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారు హెచ్చరించారు. లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ను కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా వారు సుప్రీంకోర్టులో బంజారాలను తొలగించాలని కుట్ర చేస్తూ కేసు వేయడం అనేది కాంగ్రెస్ పార్టీకే అవమానమని ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.