04-09-2025 05:28:40 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): భీమిని మండలం వెంకట పూర్ గ్రామంలో గురువారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(Krishi Vigyan Kendra) ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్. యూ. స్రవంతి ఆధ్వర్యంలో బీర సాగులో సమగ్ర పంట యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పత్తి పంటలో సాగు, అధిక వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వివిధ పంటల్లో తెగుళ్ళ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం భీమిని గ్రామంలో బీర, వంకాయ, బెండ, చిక్కుడు తోటలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. రైతులు పలు పంటలపై సాగు సందేహాలను అడిగి సలహాలను పొందారు. ఈ కార్యక్రమంలో భీమిని మండల వ్యవసాయ విస్తరణ అధికారి వినోద్, రైతులు పాల్గొన్నారు.