calender_icon.png 26 October, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు రోజులు వర్షాలు

26-10-2025 01:09:15 AM

  1. వాతావరణ కేంద్రం అంచనా 
  2. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో ఆదివారం నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆగ్నే య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం ఉదయానికి ‘మొంథా’ తుఫానుగా మారే అవకాశముంది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా పడనుంది.

తెలంగాణలో ఆదివారం అన్ని జిల్లా లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దాంతో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో.. 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షా లు కురిసే అవకాశం ఉంది.