calender_icon.png 26 October, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధికి ప్రాధాన్యం

26-10-2025 01:14:17 AM

ఉద్యోగాల కల్పనకు కృషి

  1. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 

ప్రభుత్వ రంగంలో 75 వేల నియామకాలు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హుజూర్‌నగర్‌లో అతిపెద్ద మెగా జాబ్ మేళా

ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేత

హుజూర్‌నగర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపై తెలంగాణ రాష్ర్టం సాధించుకున్నామని, మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

నివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నే షనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఎంపికైన వారికి వివిధ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లను అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఇప్పటివరకు ఎక్కడా నిర్వహించలేదని, తెలంగాణలోనే ఇది అతి పెద్ద జాబ్ మేళా అన్నారు.

ఈ జాబ్ మేళా ద్వారా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగులకు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టవ్యాప్తంగా నేటివరకు ప్రభుత్వ రంగంలో 75 వేల ఉద్యోగాలు 

 కల్పించామని వెల్లడించారు. ప్రైవేట్ సెక్టార్‌లో సైతం భారీ ఎత్తున ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మాట్లాడుతూ.. రెండు రోజులపాటు నిర్వహించే మెగాజాబ్ మేళా లో సుమారు 275 కంపెనీలు పాల్గొని గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు.

డిజిటల్ ఎంపాెు్ల్మంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామని, ఐటీ, సర్వీస్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, ఫార్మా, సిమెంట్ తదితర కంపెనీలన్నీ హుజూర్‌నగర్‌కు వచ్చి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. శుక్రవారం నాటికి జాబ్ మేళాకు 40,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు రెండు రోజులపాటు జాబ్ మేళా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు  అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని, భోజన వసతి, సౌకర్యాలు కల్పించామన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రాంగణం లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి బందోబస్తును నిర్వహించారు.

కార్యక్రమం లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీఐజీ చౌహన్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలు శరత్ చంద్ర పవర్, నరసింహ, అదనపు కలెక్టర్ సీతారామరావు, సీఐ చరమంద రాజు, సర్వోత్తమ్ రెడ్డి, కోతి సంపత్‌రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, తన్నీరు మల్లికార్జున్, వల్లపుదాసు కృష్ణ గౌడ్, షేక్ సైదా, అజిజ్ పాష, బొడ్డు గోవిందరావు, అనీఫ్, ముస్తఫా, కోడి ఉపేందర్, జక్కుల మల్లయ్య పాల్గొన్నారు.

-4,574 మందికి ఉద్యోగ అవకాశాలు

గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జాబ్‌మేళా అనంతరం మంత్రి క్యాంపు కార్యాల యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఆదివారం జరగాల్సిన మెగా జాబ్ మేళాలో ప్రైవేటు కంపెనీలు ఇతర ప్రాంతాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

శనివారం నిర్వహించిన మేళాకు సుమారు 275 కంపెనీలు 259 స్టాల్స్ నిర్వహించాయని చెప్పారు. 20,463 అభ్యర్థులు హాజరయ్యారని, 3,041 మంది ఎంపకవగా.. 1,533 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని మొత్తంగా 4,574 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని అన్నారు. మెగా జాబ్ మేళాకు రావాల్సిందిగా తాను స్వయంగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడానని, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విస్తృత ప్రచారం కల్పించామని, అందుకు తగ్గట్టుగానే భారీ స్పందన వచ్చిందని తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రంగంలో 20 నెలల కాలంలో 75వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, ప్రైవేట్ రంగంలో సైతం పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం దొరికిందని, ఇలాంటి జాబ్ మేళాల ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులను తీ సుకురా వచ్చని చెప్పారు.

జాబ్ మేళాను విజయవంతం చేయడంలో డిజిటల్ ఎం పాెు్ల్మంట్ ఆఫ్ ఎక్స్చంజ్ ఆఫ్ తెలంగాణ, సిం గరేణి కాలరీస్, జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, అధికారులకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరైన వారు ఉద్యోగాల్లో చేరేవరకు తాము నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.