calender_icon.png 26 October, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసాల కాంగ్రెస్

26-10-2025 01:06:09 AM

ప్రజలు చెక్ పెట్టాలి.. చిన్న షాక్ ఇవ్వాలి

  1. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం
  2. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : రాష్ర్టంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, కాంగ్రెస్ మోసాలకు ప్రజలు చెక్ పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ షేక్‌పేట డివిజన్ మాజీ అధ్యక్షుడు తోట మహేష్‌తోపాటు పలువురు నాయకులు శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులా బీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం మోసపో యాం.. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దు. అరచేతిలో స్వర్గం చూపిస్తే ఊళ్లలో కొందరు మోసపోయారు.

అందుకే గ్రామాల నుంచి రైతులు, ప్రజలు జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తాం’ అని చెబుతు న్నారని ఆయన చెప్పారు. ‘18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ.2,500 ఇస్తాం. యువతులకు స్కూటీలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం’ అని కాంగ్రెస్ నాయకులు అన్నారు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షనే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. రెండేళ్లలో రేవంత్ ఒక్క ఇటుక పెట్టలేదు. ఒక కొత్త పునాది లేదు కానీ తెల్లారు లేస్తే మైకు పట్టుకొని కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకు న్నారని, హైదరాబాద్‌లో కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని  ధ్వజమెత్తా రు.

‘ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారు. ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నా రు.. మగవాళ్లకు డబుల్ రేటు పెట్టారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు. ఒక్కొక్క మహిళకు నెలకు రూ.2500 చొప్పు న ఇప్పటి వరకు రూ.60 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.48 వేలు, రైతులకు రేవం త్ రెడ్డి బాకీ ఉన్నారని ఆయన లెక్కలు చెప్పా రు. బీసీలు, దళితులు, హిందువులు, ముస్లిం లు, క్రిస్టియన్లు ఏ వర్గాన్ని కూడా వాళ్లు వదల్లేదు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే చిన్న షాక్ ఇవ్వాల్సిందే.. లేదంటే వాళ్లు దారికి రా రు. “పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మేం ఏం చేయకపోయినా... మోసం చేసిన మాకే ఓటేస్తున్నారని, మేమే కరెక్ట్ అని వాళ్లు అనుకుంటారు” అని కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా వారికి ఒక్క సీటు కూడా రాలేదని గుర్తుచేశారు.

తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులు అందరూ జూ బ్లీహిల్స్ వైపు చూస్తున్నారని, బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే నెల 11న జరిగే పోలింగ్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆయన కోరారు. ‘మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని కాపాడుకుందాం’ అని ఆయన పిలుపునిచ్చారు.