calender_icon.png 26 October, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో బైకర్ శివశంకర్

26-10-2025 12:47:52 AM

బాధితుడు కాదు.. బాధ్యుడు!

లభ్యమైన పెట్రోల్ బంక్ సీసీ కెమెరా ఫుటేజ్ 

    1. కర్నూలు బస్సు ప్రమాదంలో వెలుగులోకి కీలక విషయాలు 

చిన్నటేకూరు సమీపంలో అదుపుతప్పిన బైక్

డివైడర్ ఢీకొని అక్కడిక్కడే బైకర్ మృతి

రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్ పైనుంచి వెళ్లిన బస్సు

బస్సు లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలి పెరిగిన ప్రమాద తీవ్రత 

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కర్నూలు జిల్లా చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలు గు చూస్తున్నాయి. బైక్‌ను బస్సు ఢీకొనడం తో ప్రమాదం జరిగిందని అంతా భావించారు. కానీ బైక్‌ను నడుపుతున్న వ్యక్తే ప్ర మాదానికి కారణమని తెలుస్తున్నది. మద్యం మత్తులో బైక్‌ను నడపడంతో.. ప్ర మాదం జరిగిన స్థలంలో అదుపుతప్పి డివైడర్ ఢీకొని బైకర్ మృతిచెందినట్టు తెలుస్తు న్నది. ఆ సమయంలో అతడితోపాటు బైక్ వెనకాల ఉన్న అతడి స్నేహితుడు ఎగిరి రోడ్డుకు కొద్ది దూరంలో పడ్డాడు.

రోడ్డు మధ్యలో బైక్‌తోపాటు పడివున్న శివశంకర్‌ను అక్కడి నుంచి పక్కకు జరుపుదామ నుకున్నలోపే కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొని, కొద్ది దూరం లాక్కెళ్లడంతో మంటలు వ్యా పించి, ప్రమాదం జరిగిందని సమాచారం. బస్సు లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల ఫోన్లు మంటలు అంటుకుని పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తున్నది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 

ప్రమాదానికి కారణమైన మత్తు

బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బైక ర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిగా గుర్తించి, విచారించగా పలు విషయలు వెలుగుచూశాయి. ప్రమాదానికి ముందు ఎర్రి స్వామి, బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరూ కలిసి లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 2 గంటలకు) తుగ్గలికి బయలుదేరారు. మార్గమధ్యంలో గురువారం అర్ధరాత్రి 2.24 గంటలకు కియా షోరూమ్ సమీపంలోని ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లారు.

అక్కడ నమోదైన దృశ్యాలను చూస్తే శివశంకర్ మద్యం మత్తు లో ఉన్నట్టు తెలుస్తున్నది. బంక్‌లో రూ. 300 పెట్రోల్ పోయించుకున్న తర్వాత అక్క డి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికే చిన్నటేకూరు సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు కు కుడివైపు ఉన్న డివైడర్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనకాల కూర్చున్ను ఎర్రిస్వామి కొద్దిదూరం ఎగిరిపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. అయితే రోడ్డు మధ్యలో పడి ఉన్న శివశంకర్‌ను, బైక్‌ను పక్కకు  తీద్దామనుకునే లోపే కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా బైక్‌ను ఢీకొని 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. మంటలు ఎగిసిపడటంతో ఎర్రిస్వామి భయపడి అక్కడి నుంచి తన స్వగ్రామం తుగ్గలికి వెళ్లిపోయాడు. 

నిబంధనలకు విరుద్ధంగా..

ప్రయాణికుల ట్రావెల్స్ వాహనాలు ఏవైనా ప్రయాణికుల లగేజీని మాత్రమే తీసుకెళ్లాలి. కానీ కొన్ని ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా సరుకుల రవాణా చేస్తున్నాయి. వాటిని ప్రయాణికుల లగేజీ క్యాబిన్లలో ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు బసుస ప్రమాదంలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. 

క్యాబిన్‌లో పేలిన వందల ఫోన్లు 

బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో బస్సు ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి పెట్రోల్ కారింది. అదే సమయంలో బస్సు కింది భాగంలో ఉన్న బైక్‌ను ఈడ్చుకెళ్తుండటంతో నిప్పురవ్వలు చెలరేగాయి. అప్పటికే పెట్రోల్ కారుతుండటంతో మంటలు చెలరేగాయి. మంటలు బస్సు లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్‌లో 400కు పైగా ఫోన్లతో కూడిన పార్సిల్ ఉన్నట్లు తెలిసింది.

అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడంతో మంటలు పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉన్న సీట్లు, స్లీపర్ బెర్తుల్లో ఉన్న వారికి అంటుకున్నాయి. వారు తప్పించుకునే సమయం, అవకాశం కూడా లేకుండా పోయిందని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్‌లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చింది.

దీంతో డ్రైవర్ బస్సును ఆపి, అతని సీటు పక్కన ఉండే కిటికీ నుంచి దిగాడు. బస్సు వెనక వైపునకు వెళ్లి చూడగా.. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. దీంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా బస్సు క్యాబిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న ఫోన్ల సంఖ్య ఎంత అన్నది విచారణ తర్వాత తెలుస్తుందని ఏపీ పోలీసులు వెల్లడించారు.