26-10-2025 12:54:13 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్ వార్షిక పరీ క్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వర కు.. ప్రాక్టికల్స్ అదే నెల మొదటి వారం లో నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను మాత్రం త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నవంబర్ 1నుంచి ఫీజు చెల్లింపుల ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉండనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సంస్కృతం, ఉర్దూ, అరబిక్ అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్స్ (ప్రాక్టికల్స్) ఉండను న్నాయని, గత విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌లో ఇంటర్నల్స్ పెట్టినట్లుగానే వచ్చే విద్యాసంవత్సరం నుంచి పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
అన్ని సబ్జెక్టుల్లో నిర్వహించే ఇంటర్నల్స్‌కు 20% మార్కులుంటాయని, 80% మార్కులు ఎక్స్‌ట ర్నల్స్ (వార్షిక పరీక్షలు)కు ఉంటాయని తెలిపారు. దేశంలోని 13 బోర్డులు ఇంటర్నల్ విధానాన్ని అమలు చేస్తున్నాయని, ఈసారి మనదగ్గర కూడా అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే 2026 నుంచి ఏసీఈ కొత్త గ్రూపును ప్రవేశ పెట్టబోతున్నామని, ఎంఎస్‌ఈ గ్రూపు విద్యార్థులకు మ్యాథ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తామని చెప్పారు.
12 ఏళ్ల తర్వాత సిలబస్ మార్పు
భవిష్యత్తులో విద్యార్థులకు మేలు కలిగేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి సిలబస్ లో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. కొన్ని ఆర్ట్స్ సబ్జెక్టుల్లో గత 12 ఏళ్లుగా మా ర్పులు చేయలేదని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులు ఆరేళ్ల తర్వాత మార్పులు చేయబోతున్నామని పేర్కొన్నా రు. దీనికి కోసం సబ్జెక్టు నిపుణులతో ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు, చేర్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
నవంబర్ 1నుంచి డిసెంబ ర్ 15 వరకు నిపుణులతో సిలబస్‌ను రూపొందించి ఏప్రిల్‌లో తెలుగు అకాడమీ ద్వారా పుస్తకాలను ముద్రిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం కోసం ఏప్రిల్ నెలాఖరులోనే మార్కెట్‌లోకి తెచ్చి కళాశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. నూతన సిలబస్‌తోపాటు క్యూఆర్ కోడ్ ముద్రణ ఉంటుంద న్నారు. సీఎం ఆదేశాలతో డిజిటల్ కంటెంట్‌లోకి ప్రతి చాప్టర్ మారుస్తున్నామని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం అమలు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. టీస్టెమ్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఆ సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ ల్యాబ్‌లను వాడుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులో తెచ్చినట్లు చెప్పారు.
14కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు
మరో 14 మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వలేదని, వీటి లో సెకండియర్ 1500 మంది విద్యార్థులున్నారని తెలిపారు. ఫస్టియర్ సెకండియర్ కలిపి 3వేల మంది ఉంటారని, వారికి ఇబ్బంది కలగకుండా వేరే కాలేజీల్లో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటామని తెలి పారు. రాష్ట్రంలోని 430 కాలేజీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తరగతి గదుల్లో విద్యా ర్థులను మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు.
కాలేజీలకు రాని విద్యార్థుల పేరెంట్స్‌కు మెస్సేజ్‌లు పంపిస్తున్నామని తెలిపారు. అధ్యాపకుల హాజరును సైతం మానిటరింగ్ చేస్తున్నామని, విద్యార్థుల హాజరు శాతం 60శాతం ఉందన్నారు. జేఈఈ, ఇంటర్ పరీక్షలు క్లాష్ కాకుండా ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.