calender_icon.png 21 August, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పాలనలో 5 లక్షల కోట్ల దోపిడీ

05-08-2024 12:47:02 AM

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ఏపీని సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి  ఆరోపించారు. ఆదివారం విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని, అందుకే జగన్ సర్కార్‌ను ప్రజలు ఇంటికి సాగనంపారని పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెబుతున్నారని, ఎన్నికలు జరిగితే పులివెందులలో జగన్‌ను కూడా ఓడిస్తామని సవాల్ విసిరారు.

రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేస్తామని,ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందని, అమరావతికి రూ.15 వేల కేట్లు కేటాయించారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.5 లక్షల కోట్లు దోపిడీ జరిగిందని, అందులో జగన్ ప్రజల సొమ్ము రూ.2 లక్షల కోట్లను దోచుకోగా, మిగతా నాయకులు రూ.3 లక్షల కోట్లు  కాజేశారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన నేతలంతా జైలుకుపోవడం ఖాయమని చెప్పారు.