23-05-2025 12:00:00 AM
చర్ల, మే 22 (విజయక్రాంతి)/ బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావో యిస్టులు హతమయ్యారు. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం పీడియా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బుధవారం జరిగి న ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా.. అందులో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు కూడా ఉన్నారు.
‘ఆపరేషన్ కగార్’ పేరుతో వరుస ఎన్‌కౌంటర్లలో దళ సభ్యులతో పాటు అగ్రనేతలను సైతం మావోయిస్టు వరుసగా కోల్పోతూ వస్తోం ది. కర్రెగుట్ట ఆపరేషన్ తర్వాత జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్లలో 53 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పో గా, ప్రస్తుత ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నేలకొరిగారు. మరోవైపు అబూజ్‌మాడ్‌లో భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్ కొన సాగిస్తున్నాయి.
ఎన్‌కౌంటర్‌లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, భారీ వర్షం కురుస్తుండటంతో మృతదేహాలను తరలించే ప్రక్రియ ఆలస్యమవుతోందని పోలీసు వర్గా లు తెలిపాయి. అబూజ్‌మాడ్ ఎన్‌కౌంటర్ అనం తరం తిరిగి వస్తున్న క్రమంలో రమేశ్ హేమ్లా అనే డీఆర్‌జీ జవాన్ ఐఈడీ పేలి మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు.
27 మంది మావోయిస్టుల గుర్తింపు
నారాయణపూర్‌లోని మాడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయి స్టులను గుర్తించారు. నంబల కేశవరావు సహా 27 మంది మావో యిస్టులపై రూ.2 కోట్ల 77 లక్షల రివార్డు ఉందని పోలీ సు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మరణించిన మావోయిస్టుల మృత దేహాలను గురువారం హెలికాప్టర్ ద్వారా నారాయణ్‌పూర్‌కు తరలించి పంచనామా నిర్వహించారు.