23-05-2025 12:12:33 AM
గుంటూరు, మే 22 (విజయక్రాంతి): చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో ఈనెల 26వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాదెండ్ల రామారావు తెలిపారు. చలపతి ఫార్మసీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ ఫార్మా కంపెనీలు నాట్కో, అరబిందో, హెట్రో పాల్గొనబోతున్నాయని చెప్పారు.
ఈ సంస్థలు దేశవ్యాప్తంగా పేరున్న కంపెనీలు కావడంతో, విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఈ వేదిక ద్వారా లభించబోతున్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాకు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, డిప్లొమా, ఐటీఐ వంటి విద్యార్హత లు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు విద్యా సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాల్సిందిగా కోరారు.
ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్, ఇంటర్వ్యూలు, టెక్నికల్ రౌండ్లు జరుగుతాయని, ఎంపికైన అభ్యర్థులకు కంపెనీల్లో నేరుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నా రు. అనంతరం జాబ్‌మేళాకు సంబంధించి గోడపత్రికను చలపతి విద్యాసంస్థల అధినేత వైవీ ఆంజనేయులు ఆవిష్కరించారు.